- కరోనా గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా జగన్ మాట్లాడారు
- వైరస్ విషయంలో జగన్ ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారు
- ఎస్ఈసీ రమేశ్ ను కులం పేరుతో దూషించడం దారుణం
- కరోనా వైరస్ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రపంచమంతా నవ్వుకుంటోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
- వైరస్ గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా జగన్ మాట్లాడారని విమర్శించారు.
- కరోనా నేపథ్యంలో దేశమంతా అలర్ట్ అయిందని… జగన్ మాత్రం మొద్దు నిద్రలోనే ఉన్నారని దుయ్యబట్టారు.
- ఎస్ఈసీ రమేశ్ ను కులం పేరుతో దూషించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
- గతంలో అల్లర్లు పులివెందులకు మాత్రమే పరిమితమయ్యేవని… ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించాయని అన్నారు.
- పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తుండటం దారుణమని విమర్శించారు.
- జగనన్నకు గిఫ్ట్ ఇస్తామని కొందరు సీఐ స్థాయి అధికారులు బహిరంగంగానే ప్రకటించారని చెప్పారు.
Recent Comments