చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోలిస్తే..వైరస్ ప్రభావం ఇటలీని మరింత తీవ్రంగా కలచివేస్తోంది..
గడిచిన 24 గంటల్లో ఇటలీలో అత్యధికంగా 475 మరణాలు సంభవించాయి. ఈ సంఖ్యను బట్టి ఇటలీవాసులపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..
కరోనా వైరస్ కారణంగా ఒకే రోజులో ఇంత ఎక్కువ మరణాలు సంభవించిన తొలి దేశం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ స్థాయిలో మరణాలు వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో కూడా నమోదు కాలేదు..
నిన్న మరణించిన 475 మందితో కలిపి ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 2,978కి చేరినట్లు అధికారులు. వైరస్ బారిన పడిన వారి సంఖ్య 35,713కు చేరింది..
Recent Comments