ఎస్ఈసీ లేఖపై అసందిగ్ధతకు తెరపడిందన్న గల్లా. లేఖను హోంశాఖ స్వీకరించినట్టు తేలిందని వెల్లడి ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన వ్యవహారంపై ఎట్టకేలకు తెరపడిందని, ఎస్ఈసీ నుంచి లేఖ వచ్చిన మాట నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా నిర్ధారించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఎస్ఈసీ నుంచి వచ్చిన లేఖను హోం మంత్రిత్వ శాఖ స్వీకరించిందని కిషన్ రెడ్డి వెల్లడించారని తెలిపారు.

లేఖలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు భద్రత పెంచిన కేంద్రం… స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ నేతల దాడులు, బెదిరింపులు, అపహరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని ట్వీట్ చేశారు. ఇది ఎంతో కీలక సమయం అని, కేంద్రం తన అసాధారణ అధికారాలను ఉపయోగించి ఏపీలో శాంతిభద్రతలు చక్కదిద్దడమే కాకుండా, రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని కోరారు.