• కరోనా వ్యాధిని ఎదుర్కోవటంలో ఎపి ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు సాగటం లేదు
 • మొదట్లో ఎన్నికల obsessionలో ఉండి కరోనా ను అశ్రద్ధ చేశారు. తీరా పరిస్థితిని గుర్తించిన తర్వాత కూడా తగిన రీతిలో స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
 • వైద్య సిబ్బందికి అవసరమైన మాస్క్ ల వంటి కనీస రక్షణ పరికరాలు కూడా సమకూర్చటంలో విఫలమయ్యారు
 • కోవిడ్-19 తెచ్చిపెట్టిన ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించటానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 10000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి.
 • వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, పోలీసులు, అక్కడక్కడ కొంతమేరకు బాగానే పనిచేస్తున్న వాలంటీర్లకు అవసరమైన మాస్క్ లు, గ్లోవ్స్, శానిటైజర్స్ తక్షణమే సమకూర్చాలి
 • వైద్యులు, నర్సులు, తదితర వైద్య సిబ్బందికి PPES (ప్రొటెక్షన్ కిట్స్), టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్స్, మందులు సమృద్ధిగా సప్లై చేయాలి.
 • విస్తృతంగా టెస్టింగ్ చేసే సౌకర్యం. తగిన సౌకర్యాలతో కూడిన ఐసోలేషన్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
 • పేదలకు, రోజు వారీ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు. వలస కార్మికులకు ఈ లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం నిత్య జీవితావసరాలను రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఉచితంగా అందించాలి
 • ప్రతి కుటుంబానికి కనీసం 5 వేల రూపాయల నగదు ఇవ్వాలి.
 • ఇప్పుడిక విస్తృతంగా టెస్టింగ్ జరిగితే క్వారంటైన్ సీరియస్ గా అమలు చేస్తేనే పరిస్థితి అదుపులో ఉ ంటుంది. లేదంటే ఉపద్రవం తప్పదు.
 • ప్రధాన మంత్రి చెప్పే చప్పట్లు, లైట్లు ఆర్చి చిట్కాలతో కరోనాను తరిమి కొట్టలేము*
 • కాబట్టి వారి మాటలకు వంత పాడటం మాని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం*
 • అవసరమైన నిధులను కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవాలి*
 • రాష్ట్రానికి కనీసం 25000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరవలసిన అవసరం ఉంది*
 • దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది*
 • టెస్టింగ్ కిట్స్, PPES, వెంటిలేటర్స్ తదితర వైద్య పరికరాల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి
 • రాష్ట్రంలో వాలంటీర్లు కావాలని మీరు ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుంది
 • జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు వాలంటీర్లు గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ లేఖలో పేర్కొన్న శైలజానాధ్