• విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఏప్రిల్ 14 తర్వాతే నిర్ణయం: కేంద్రం
  • కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది.
  • ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు.
  • ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనుందని, విద్యా సంస్థల పునఃప్రారంభంపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
  • విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారు.
  • లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు