ఇది అక్షరాలా పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడికి సరైన పోలిక అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నపుపుడు ఎల్లో మీడియా మద్ధతు, మాయమర్మాలతో ప్రజలకు ముఖ్యంగా రైతులకు నిలువెత్తూన మోసం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కు ఆయన పాలన కాలమంతా కుడి ఎడమల ధగాగా మిగిలిపోయింది. అందుకు అప్పట్లో హడావిడిగా ఒక గేటును (వాస్తవానికి గేటు కాదు, రేకు ముక్కను తాత్కాలికంగా బిగించి మీడియాలో పబ్లిసిటి వచ్చాక మళ్లీ తీసేశారు) అక్షరాలా ఈ రేకు ముక్క బిగించి తీయడానికే ప్రభుత్వానికి అయిన వ్యయం 8 లక్షల రూపాయలు. ఇది కాకుండ ముఖ్యమంత్రి, ఇతరుల పర్యటన, ప్రచార్భాట ఖర్చు లక్షల్లో అధనం.

ప్రచారం ఆర్భాటంతో డబ్బాకొట్టినప్పటికీ…

2019 జనవరిలో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 42 – 43 పిల్లర్లు (సిమెంట్ స్థంభాలు – పియర్స్) మధ్య నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేటును ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. ఈ బిగింపు ప్ర్రక్రియ చాలా ఘనంగా జరిగింది. నాటి ప్రభుత్వానికి విస్తృతంగా ప్రచారం కూడా వచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ గేటు లేదు. వాస్తవానికి అప్పుడు బిగించింది గేటు కాదు. ఇనుప రేకు మాత్రమే. చంద్రబాబు అంత కష్టపడి అప్పుడు గేటు బిగించి గేట్ల ఏర్పాటు ప్రక్రియ మొదలైందని 2019 చివరి నాటికి అన్నిగేట్లు ఏర్పాటవుతాయని ఘనంగా డబ్బాకొట్టినప్పటికి ఒక్క గేటు ఏర్పాటు కాలేదు. అప్పుడు ఆయన ఘనంగా దగ్గరుండి బిగించిన గేటు కూడా కానరాదు. వైయస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఆ గేటును ధ్వంసం చేసేశారిని మనబోటి వాళ్లకు అనుమానం రావడం సహజం. అదే విషయం అధికారులను (అప్పుడున్న అధికారులనే) ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అసలు వాస్తవాలేంటో పరిశీలిద్దాం:

ఇనుప రేకే పోలవరం గేటు…

స్పిల్ వే లో గేట్లు బిగించాలంటే పియర్స్ ఎత్తు 55 మీటర్లు ఉండాలి. చంద్రబాబు అధికారం నుండి దిగిపోయేనాటికి సరాసరిన 29 మీటర్ల మేర నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే గేట్లు బిగించడం సాధ్యం కాదు. దానికి తోడు గేట్లు కూడా ఏర్పాటు కాలేదు. గేట్లు బిగించడానికి ముందు స్పిల్ వే పై గడ్డర్లు, హాయిస్ట్ వ్యవస్థ, హైడ్రాలిక్ వ్యవస్థ వాటి అనుబంధ పనులు పూర్తికావాలి. ఇవేవీ అప్పట్లో మచ్చుకు కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ అప్పటికప్పుడు ఒక పొడవైన రేకును గేటులాగా సిద్ధం చేసి చంద్రబాబు దగ్గరుండి ఇంజనీర్లతో బిగించారు. ఆ తర్వాత దానిని తీసి పక్కన పారేశారు. ఇందుకోసం ప్రభుత్వానికి అప్పట్లో రూ. 8 లక్షల భారం అయ్యింది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తన యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 8న ఘనంగా పబ్లిష్ చేసుకున్నారు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. గేటు (ఇనుప రేకును) ఏర్పాటు ప్రక్రియను చరిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఒక్కొక్కటి 250 మెట్రిక్ టన్నుల బరువు కలిగిని 48 రేడియల్ గేట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయినట్లు పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు మాత్రమే గేట్లు బిగించడానికి అనువైన ఎత్తుకు స్పిల్ వే నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతం గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో 42-43 పియర్స్ ను చూస్తే స్పష్టమవుతోంది. గడ్డర్లు ఏర్పాటయ్యి గేట్ల బిగింపునకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు కాగానే తుది అంకంగా గేట్లు బిగిస్తారు. కానీ అవేవి లేకుండానే ఎల్లో మీడియా పబ్లిసిటి స్టంట్ కోసం అప్పట్లో ఆయన ఆ విధంగా కానిచ్చేశారు.

దేవినేని ఉమ ఛాలెంజ్ లు

2016 ఫిబ్రవరిలో శాసనసభలో నాటి నీటి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, నాటి ప్రతిపక్ష జగన్ కు ఛాలెంజ్ విసిరారు. ‘జగన్ కాస్కో, 2018 చివరినాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపిస్తాం’ అని ప్రకటించారు. తీరా చూస్తే తెలుగుదేశం అధికారం నుండి దిగిపోయేనాటికి కీలకమైన పనులేవీ పూర్తికాలేదు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నపుపుడు పూర్తి చేసిన కుడి – ఎడమల కాలువలతో పాటు ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రధానమైన అనుమతులు సాధించారు. వైయస్ పూర్తిచేసిన కుడి కాలువపై పట్టిసీమ పంపులను చంద్రబాబు కమీషన్ల కోసం ఏర్పాటు చేసి భజన చేయించుకున్నారు.

బాబు పాలనలో అశాస్త్రీయంగా…

పోలవరం ప్రాజెక్ట్ లో స్పిల్ వే, మట్టి, రాతి కట్ట (గ్యాప్- 2 తో పాటు గ్యాప్…1,3) లతో పాటు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణాలు పూర్తికావాలి. ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళలో జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి గంప మట్టి కూడా తీయలేదు (తీరా ఇప్పుడు దేవినేని ఉమ గంప మట్టి తీశార, తట్టేడు కాంక్రీట్ వేశారా అని రోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు). ప్రాజెక్ట్ లో కీలకమైన గ్యాప్- 2, రాతి, మట్టికట్ట పనులు అసలు ప్రారంభమే కాలేదు. చంద్రబాబు అశాస్త్రీయమైన పద్దతిలో, ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనీరింగ్ నియమాలకు విరుద్ధంగా ఎగువ కాఫర్ డ్యాం, స్పిల్ వే నిర్మాణ పనులు రెండు ఒకేసారి చేపట్టి రెండింటిని కూడా పూర్తిచేయాలేకపోయారు. దాంతో 2019 వరదలు ఒకవైపు ప్రాజెక్ట్ కు, మరోవైపు గ్రామాలకు తీవ్ర నష్టం కలిగించియి. కనీసం 4 టిఎంసీల వరదనీరు ప్రాజెక్ట్లోకి చేరినందుకు దానిని తోడేందుకే ఈ ప్రభుత్వానికి మూడు నెలల సమయం పట్టింది. ఆ తరువాతే పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పుడు స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే గోదావరిని ఇటు మళ్లించి అప్పుడు ఎగువు, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తిచేయడంతో పాటు మిగిలిన ప్రధానమైన గ్యాప్..1,2,3 పనులు మొదలు పెడతారు. ఇదే సమయంలో జల విద్యుత్ కేంద్రం, ఇతరత్రా పనులు సాగుతున్నాయి. ఇదంతా చూస్తే చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్ట్ కు కుడి, ఎడమలను ధగా చేసి, మాయమర్మాలతో ప్రజలను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు చేప్పండి నిజమేంటో. అప్పుడు బిగించిన ఇనుప రేకు ఎక్కడుందో చూడండి… బాబుగారికి బహుమానంగా ఇద్దాం.