ఏడు చేపల కథ సినిమా తో అందరి దృష్టిని ఆకట్టుకొని కమర్షియల్ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య తాజాగా తన రెండో ప్రాజెక్ట్ గా బీకామ్ లో ఫిజిక్స్ అనే కమర్షియల్ ఎంటెర్టైనెర్ ని రెడీ చేస్తున్న సంగతి తెల్సిందే. బీ కామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ తోనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు డైరెక్టర్ సామ్ జై చైతన్య అండ్ కో. విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డం లో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే శ్యామ్ బీకామ్ లో ఫిజిక్స్ కి కూడా అదే పంధా ని కొనసాగించారు. టీజర్ ఆద్యంతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నింపేశారు.

ఏడుచేప‌ల క‌థ చిత్రం లో ఎంట‌ర్‌టైన్ చేస్తూ త‌ల‌సీమియా వ్యాధి పై చ‌ర్చించారు. ఇప్ప‌డు కూడా బ‌ర్నింగ్ ప్రాబ్లం ని చాలా బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేయటానికి సిధ్ధ‌మయ్యాడు. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొ హింది, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హిందీ లో ఈ సినిమా కరణ్ జోహార్ అనే టైటిల్ తో విడుదల అవుతుంది.