ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో రోపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా “లేడీ”. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక క్యారెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్సుకుడు కళ్యాణ్ తెలిపారు. అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్.

సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమాకి మధివి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.